08-05-2025 12:00:00 AM
చర్ల మే 7 (విజయ క్రాంతి): పేదవాడి సొంత ఇంటి కల ఇందిరమ్మ రాజ్యం తోనే సాధ్యమవుతుందని, పూరి గుడిసెల్లో ఉం టూ సొంత ఇంతే కలలు కంటున్న పేదవారి కళను నెరవేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ ని ర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల గిరిజన మండలమైన చర్లలో విస్తృతంగా పర్య టించి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. మండల చర్ల మండలం సుబ్బంపేట గ్రామంలో రూ 20 లక్షల వ్య యంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని, రూ 1.16 కోట్లతో నిర్మించిన గ్రంథాలయం, తేగడ గ్రామంలో పుల్లూరి సుధాకర్ సరోజినీ దంపతుల ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటికి భూమి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం ఆ యన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చే 16 నెలల కాలంలో దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ 5 లక్షల ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఆ ప్రభుత్వాలు కేవలం రూ లక్ష మాత్రమే ఇచ్చి ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలారని ఆయన ఆరోపించారు. ఇందిర మ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదవాడి కల నెరవేర్చేందుకు ప్రతి ఇంటికి 2 5 లక్షల రూపాయలు సహాయం అందిస్తున్నామన్నా రు. పేద ప్రజలు వారి సమస్యలను తెలుపుకోవడానికి తప్పకుండా గ్రామపంచాయతీ కార్యాలయానికి వస్తుంటారని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా అవకాశం కల్పించడానికి గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మిం చామన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే గిరిజన విద్యార్థిని విద్యార్థుల సౌకర్యార్థం సకల సౌకర్యాలతో గ్రంథాలయం నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు. వి ద్యార్థులకు అవసరమైన కెరీర్ గైడెన్స్ లకు సంబంధించిన పుస్తకాలు డీఎస్సీ నీట్ జేఈ ఈ విజ్ఞానానికి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలతో పాటు విశాలంగా కూర్చొని చదువుకోవడానికి సౌకర్యాలు కల్పించామన్నారు. దారిద్ర రేఖకు దిగవనున్న నిరుపే దలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం యావత్తు సన్నబి య్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సుబ్బంపేట గ్రామంలోని సన్న బియ్యం లబ్ధిదారుడైన వాసం ముసలయ్య కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. మంత్రికి సన్నబి య్యంతో పాటు పాయసం పులిహోర సేం ద్రియ ఎరులతో వండిన తోటకూర పప్పు గోంగూర చట్నీ వడ్డించారు. మంత్రివర్యులు సంతోషంగా తిని భోజనం చేసిన తర్వాత కు టుంబ సభ్యులను అభినందించి నిరుపేదలందరికీ ఆహార భద్రత కల్పించేలా బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. దుమ్ముగూడెం మండలం చిన్న బండరేవు గ్రామపంచాయతీలో రూ 74.5 లక్షల వ్య యంతో నిర్మించనున్న అంతర్గత శశి రోడ్ల నిర్మాణానికి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పిఎస్పిసి చైర్మన్ రవికుమార్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఏ పి ఓ రాహుల్, ఆర్డిఓ దామోదర్ రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, హౌసింగ్ పీడీ శంకర్,డి ఆర్ డి ఓ విద్యా చందన తదితరులు పాల్గొన్నారు.
జాబితాలో పేరు లేని వారు ఆందోళన పడవద్దు.. మంత్రి
పినపాక,మే7 (విజయక్రాంతి): రానున్న మూడు,నాలుగేళ్లలో రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి అన్నారు. బుధవా రం పినపాక మండలం గొట్టెల గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో కలిసి ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ని యోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున నిర్మిస్తామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేకే తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి ఆరో పించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా ఇళ్లు లేక పేద ప్రజలు ఎదుర్కోన్న ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందన్నారు.ఇందులో భాగంగా తొలి విడత 4 .50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చే శామన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. లబ్దిదారుల జాబితా లో పేర్లు లేని వారు ఎలాంటి ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, మలివిడతలో అధికారులు లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తారని తెలిపారు. ప్రతి సో మవారం లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లులు జ మ చేస్తామని తెలిపారు.
అర్హులు కానీ వారి ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయరాదని స్పష్టం చేశారు. ఎవరైనా అర్హుల జాబితాలో తప్పులు చేస్తే దానికి బాధ్యత వహించేది సం బంధిత అధికారి మాత్రమే అని మంత్రి హె చ్చరించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి పార్టీతో సంబంధం లేకుండా ఇం దిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు. ప్రజలకు మంచి చేస్తే కూడా ఓర్వలేక ప్రతిపక్షాల నేత లు విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటి ల్, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, తుళ్లూ రు బ్రహ్మయ్య , బాల సాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కోర్సా ఆనంద్, స్పెషల్ ఆఫీసర్ ఏడిఏ తాతారావు, డిఎల్పిఓ సుధీర్ కుమార్, తాసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో సునీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఏపీఓ వీరభద్రస్వామి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతిథులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.