15-10-2025 01:23:38 AM
‘హే మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా.. పొద్దున లేచిందగ్గర్నుంచీ డెయిలీ యుద్ధాలా..’ అంటూ సాగుతున్న పాట ఎట్టకేలకు విడుదలైంది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలోని ఈ పాట అనివార్య కారణాల వల్ల ఓ రోజు ఆలస్యంగా మంగళవారం రిలీజ్ అయింది. చిరంజీవి నాయకానాయికలుగా నటిస్తున్న తాజాచిత్రమే ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ‘మీసాల పిల్ల’ ఆపటను భాస్కరభట్ల రాయగా ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడారు. ఆలుమగల మధ్య నిత్యకృత్యంగా కనిపించే గొడవల ఇతి వృత్తంగా చిరు, నయన్‌లపై చిత్రీకరించిన ఈ పాట సాహిత్యం ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ‘మొగుడు పెళ్లాలంటేనే కంకీకొడవల్లా, కలకత్తా కాళీ మాత నీకు మేనత్తయ్యేలా, నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా’ అంటూ భాస్కరభట్ల రాసిన లైన్లకు సాహితీప్రియులు చప్పట్లు కొట్టకుండా ఉండలేరంటే నమ్మండి! మ్యూజిక్ కంపోజిషన్, లిరిక్స్, కొరియోగ్రఫీ, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ.. అన్నీ కలగలి సిన ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారనుంది. 2026 సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రానుంది.