calender_icon.png 13 November, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో ఒక్క వ్యక్తే ప్రధాని కావాలనుకుంటారు

29-07-2024 02:35:52 PM

న్యూఢిల్లీ: బీజేపీలో ఒక్క వ్యక్తే ప్రధాని కావాలని అనుకుంటారు. బీజేపీలో ఎవరైనా ప్రధాని కావాలని కలలు కంటే మరుక్షణం నుంచి వారు భయపడాల్సిందేనని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో బడ్జెట్ పై రాహుల్ మాట్లాడారు. బీజేపీని చూసి దేశంలో అన్ని వర్గాలు భయపడుతున్నాయని ఆయన ఆరోపించారు. దేశంలో యువత, రైతులు, కార్మికులు అందరూ భయపడుతున్నారని వెల్లడించారు. పద్మవ్యూహంలో చిక్కకున్న అభిమన్యుడిలా దేశం పరిస్థితి ఉందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పద్మవ్యూహాన్ని బలహీనపరిచింది.. గత సెషన్ లో తన మాటలతో కొందరు భయపడ్డారని ఆయన తెలిపారు. 

అగ్నివీర్ లను కేంద్రం మోసం చేస్తోంది, అగ్నివీర్ ల పింఛను కోసం బడ్జెట్ లో రూపాయి కేటాయించలేదని ప్రశ్నించారు. పంటలకు ఎంఎస్పీ ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారు, రైతులకు ఇప్పటివరకు స్పష్టమైన హామీ లభించలేదన్నారు. కేంద్రం విధానాలు చూసి రైతులు భయపడుతున్నారని వెల్లడించారు. రైతు సంఘాల నేతలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఆరోపించారు. రైతులకు లీగల్ గ్యారంటీడ్ ఎంఎస్ పీ ఇస్తామని చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో మధ్య తరగతి ప్రజలంతా ప్రధాని చెప్పినట్లు చేశారని గుర్తుచేశారు. ఈ బడ్జెట్ లో మధ్యతరగతి వారికి ఎలాంటి లబ్ధి కలిగించలేదని తెలిపారు. తమ హయాంలో నింబంధనలు సడలించి రైతులకు రుణమాఫీ చేశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం.. అంబానీ, అదానీకి మాత్రమే ప్రయోజనం కలిగిస్తోందన్నారు.