calender_icon.png 13 November, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలి: కూనంనేని

29-07-2024 02:58:50 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ అంశంపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది. విద్యుత్ పైనే కాదు సింగరేణి సమస్యలపై మాట్లాడితే బావుండేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణికి ప్రభుత్వం నుంచి రూ. 21 వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని డిమాండ్  చేశారు. విద్యుత్, సింగరేణిని కలిపి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ప్లాంట్లలో సబ్ క్రిటికల్ టెక్నాలజికి వెళ్లడం వెనక మతలబు ఏంటో? అని ప్రశ్నించారు. సింగరేణిని, కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరారు. జీతాలు పెంచమని అడిగినందుకే గత ప్రభుత్వం కార్మికులను సస్పెండ్ చేసిందని, సింగరేణి కార్మికులు అనే సమస్యలతో సతమతమవుతున్నారని కూనంనేని వెల్లడించారు.