04-10-2025 05:04:42 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సహనా బేగం, తన ఇద్దరు మానవరాళ్లతో కలిసి మహబూబాబాద్ కి వచ్చి కురవి గేట్ వద్ద ఆటో ఎక్కి బేతోల్ లో దిగి తన చెల్లి ఇంటికి వెళ్లగా, తన బ్యాగ్ ని ఆటోలో మర్చిపోయిన విషయం గుర్తు వచ్చి వెంటనే బాధితురాలు కురవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అదనపు ఎస్ఐ జయకుమార్, పోలీస్ కానిస్టేబుళ్లు అనిత, రమేష్ లు సాంకేతికత ఆధారంతో ఆటో మరిపెడ వైపు వెళ్తోందని తెలుసుకొని బాధితురాలిని పోలీస్ వాహనంలో తమతో పాటు తీసుకువెళ్లి పురుషోత్తమాయగూడెం వద్ద ఆటోను ట్రేస్ చేసి తనిఖీ చేయగా బ్యాగ్ దొరకడంతో పాటు బ్యాగ్ లో ఉండాల్సిన తులం బంగారం, రెండు స్మార్ట్ సెల్ ఫోన్స్ స్వాధీనం తీసుకొని బాధితురాలికి అందజేశారు. బ్యాగు పోగొట్టుకున్న సంఘటనపై ఫిర్యాదు చేయగానే కురవి పోలీస్ స్పందించిన తీరు, ఆమె వస్తువులు ఆమెకి దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తూ, పోలీసులకు కృతఙ్ఞతలు తెలిపారు.