06-08-2025 01:10:21 AM
సత్యరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేశ్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. విజయ్‌పాల్‌రెడ్డి అడిదెల నిర్మాత. మోహన్ శ్రీవత్స దర్శకుడు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సత్యరాజ్ మాట్లాడుతూ.. “త్రిబాణధారి బార్బరిక్’ సినిమాలో కథే మెయిన్ హీరో. 70 ఏళ్లు దాటినా కూడా నేను ‘బార్బరిక్’ లాంటి కొత్త పాత్రల్ని మరిన్ని చేయాలనుకుంటున్నా” అన్నారు. ఉదయభాను మాట్లాడుతూ.. “నేనేమీ సినిమాలకు దూరంగా ఉండలేదు.
నచ్చిన పాత్రలే చేస్తున్నా. ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ పాత్రను మోహన్ నాకు ఇచ్చారు. ప్రతీ పాత్రను నేను ప్రాణం పెట్టి పోషిస్తాను. మన భాషలో ఇలాంటి చిత్రాలెందుకు రావు? అని అంతా అంటుంటారు. అలాంటి వారిని ఆశ్చర్యపరిచేలా మా చిత్రం ఉంటుంది” అని చెప్పారు. ‘క్లారిటీ, కమిట్‌మెంట్, కంటెంట్ ఉన్న చిత్రమిద’ని దర్శకుడు మోహన్ శ్రీవత్స తెలిపారు. నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ‘బార్బరిక్’ చిత్రం ఆగస్ట్ 22న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు వశిష్ట ఎన్ సింహా, క్రాంతికిరణ్, సాంచీ రాయ్, చైల్డ్ ఆర్టిస్టులు కార్తికేయ, మేఘన, కెమెరామెన్ కుశేందర్ రమేశ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేశ్, కొరియోగ్రాఫర్ ఈశ్వర్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.