22-03-2025 12:00:00 AM
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్
మహబూబాబాద్, 21 (విజయక్రాంతి) : ఎల్‌ఆర్‌ఎస్‌పై హైదరాబాద్ నుండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓలు, డిటిసిపిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్, 25 శాతం రాయితీతో ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్ క్రమబద్ధీకరణ పత్రాలను అందజేయాలన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌పై క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించి ప్రభుత్వ నిబంధన ల ప్రకారము ఫీజులు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫీజు చెల్లించిన వారికి ప్రోసి డింగ్ కాపీలను వెంటనే అందించాలని, అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, ఎల్ ఆర్‌ఎస్‌లో అర్హులైనవారికి సిబ్బంది స్వయం గా కాల్ చేసి ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ వీడియో కాన్ఫరె న్స్లో జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు శాంతికుమార్, రవీందర్, నరేష్‌రెడ్డి, ఉదయ్, డిటీసీపీఓ సాయి రామ్, డివిజనల్ పంచాయతీ అధికారులు పుల్లారావు, దుర్గ పాల్గొన్నారు.