calender_icon.png 30 January, 2026 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిచ్చికుక్క స్వైరవిహారం

04-10-2024 12:23:17 AM

ఐదుగురికి తీవ్రగాయాలు

హుజూరాబాద్, అక్టోబర్ 3: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మం డలం కోరపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గురువారం ఉద యం కనిపించిన వారిని కరుస్తూ వెళ్లగా, ఐదుగురు గాయాలపాలవ్వగా, ఓ చిన్నారి పరిస్థితి విష మంగా ఉన్నది. గ్రామానికి చెందిన మద్దర్ల అక్షర అనే మూడేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడిచేసింది. తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై గ్రామస్థులు గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళనకు దిగారు. గ్రామంలో నిత్యం కుక్కలు దాడి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు.