calender_icon.png 18 August, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మడేలయ్యా స్వామి జల బిందెల ఊరేగింపు

17-08-2025 11:39:22 PM

మునగాల,(విజయక్రాంతి): రజకుల కుల దైవం సీతాలమ్మ సమేత మడేలయ్యా పోతురాజు స్వాముల దేవాలయ ప్రారంభోత్సవం  విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు  ఆదివారం మండల కేంద్రంలో దేవాలయ నిర్మాణ కమిటీ రజక సంఘం ఆధ్వర్యంలో జల బిందెల ఊరేగింపు ప్రదర్శన అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి రజక ఆడపడుచులు తలపై జల బిందెలు పెట్టుకొని, డప్పు సప్పులు మేళతాళాల ఊరేగింపుల నడుమ ఉత్సాహంగా గ్రామ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం గ్రామంలోని చెరువుగట్టు నందు నూతనంగా నిర్మాణం చేసుకున్న మడేలయ్య స్వామి దేవాలయానికి చేరుకొని నూతనంగా ప్రతిష్టించనున్న సీతాలమ్మ ,మడేలయ్యా, పోతురాజు స్వామి విగ్రహాలకు జల బిందెల నీళ్లతో జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు, అదేవిధంగా ఆదివారం ఉదయం నూతన దేవాలయ ప్రాంగణంలో  పురోహితులు వారణాసి బుజ్జి రామయ్య శాస్త్రి, వారణాసి కిషోర్ శాస్త్రిల ఆధ్వర్యంలో గణపతి పూజ, హోమం నిర్వహించారు.