18-08-2025 12:00:00 AM
కామారెడ్డి అర్బన్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు అలుగు వెళ్లడంతో చెరువును పరిశీలించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చెరువులో స్నానాలు చేస్తూ సందడి చేశారు. పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పెద్ద చెరువు అలుగు పారుతున్న నీటిని చూస్తూ పిల్లలు, పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తూ నీటిలో సందడి చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆదివారం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల నుంచి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పెద్ద చెరువులో నీటిని తిలకించారు.