calender_icon.png 18 August, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

18-08-2025 01:42:18 AM

  1. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయండి

ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రవి కిరణ్

రైతులు అధైర్యపడొద్దు అన్నివిధాల ఆదుకుంటాం: జిల్లా ఎమ్మెల్యేలు 

వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లు, ఎస్పీలు పర్యటనలు

నిర్మల్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణం గా వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉండాలని, వర ద సహాయ చర్యలు వేగంగా చేపట్టాలని ఉమ్మ డి జిల్లా ప్రత్యేక అధికారి రవి కిరణ్ అధికారులకు సూచించారు. ఆదివారం నిర్మల్ జిల్లాలో ని వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

నిర్మల్ పట్టణంలోని జిఎన్‌ఆర్ కాలనీ తో పాటు కడెం ఖానాపూర పాండాపూర్‌రాంపూర్ వంతెనలు, పంట పొ లాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాం తాల్లో గ్రామస్తులను కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఈ నెల 20 వరకు వర్షా లు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కడెం, స్వర్ణ, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టుల్లో నీరు అధికంగా చేరుతుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని చెప్పా రు. చేపలు పట్టేవారు, రైతులు, పశువుల కాపరులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని హెచ్చరించారు.  కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలను అప్రమ త్తం చేస్తూ, సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

24 గంటలు కంట్రోల్ రూమ్ (9100577132) అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచా రం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా అధికారులు గోవింద్, శ్రీనివాస్, అంజి ప్రసాద్, రమణ, డా.రాజేందర్ పాల్గొన్నారు.

అధికారుల పర్యటనలు..

ఆదిలాబాద్, ఆగస్టు 17(విజయక్రాంతి): జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటించారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని వికలాంగుల కాలనీ, జి.ఎస్ ఎస్టేట్ కాలనీల్లో పర్యటిం చి నీట మునిగిన ఇళ్లతో పాటు పరిసరాలను పరిశీలించారు.అదేవిధంగా అదిలాబాద్ రూర ల్ మండలంలోని భర్నూర్ వద్ద  తెగిన తీన్ నాళ చెరువును వెళ్లి  స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

అదేవిధంగా నీట మునిగిన పంట పొలాలను సైతం పరిశీలించా రు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ... మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం, ఇళ్లలోకి నీరు చేరి, తదితర ఘటనలపై పూర్తి సమాచారం సేకరించి, ఎస్డీఆర్‌ఎఫ్ మార్గదర్శకాలను అనుసరించి తగిన సహా యం అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు.

వర్షాల వల్ల ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ పెద్ద స్థాయి లో నష్టం జరగలేదని పేర్కొన్నారు. అయితే, మరో 3, 4 రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నందున, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. లో లైయింగ్ ఏరియాలు, నీరు పొంగి ప్రవహించే ప్రాంతా ల్లో అధికారులు ఎప్పటికప్పుడు ఫీల్డ్లో ఉండాలని, ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెన్‌గంగా నది ప్రవా హం పెరిగిన నేపథ్యంలో, బోరజ్ మండలం, జైనథ్, బేలా మండలాల్లోని పరిసర గ్రామాల్లో నీటి ప్రవా హం ముప్పు ఉందని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో అధికారులను అప్రమ త్తం చేసి, ప్రజలను ముందుగానే హెచ్చరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సుమా రు 350 ఎకరాలు నష్టం అంచనా వేయడం జరిగిందనీ,

ఈ సందర్భంగా పంట నష్టం వివరాలు సర్వే నిర్వహించి తదుపరి చర్యల నిమి త్తం ప్రభుత్వానికి నివేదిక సమర్పించే చర్యలు ముమ్మరం చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామిని ఆదేశించారు. అధికారులు మారుమూల గ్రామాలలో దెబ్బతిన్న రోడ్లు వంతె నలకు యుద్ధ ప్రాతిపదికన మరమత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వర్షా ల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుం డా ఆన్ని చోట్ల మెడికల్ క్యాంప్ నిర్వహించాలని, ఈ సందర్భంగా పలు కాలనీలలో ఏర్పా టు చేసిన మేదికల్ క్యాంప్‌లను కలెక్టర్ ఎస్పీ లు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి పాల్గొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండండి: మంత్రి జూపల్లి 

నిర్మల్, ఆగస్టు 17(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ప్రజల ఇబ్బం దులు అధికారుల సహాయక చర్యలపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఆరా తీశారు. హైదరాబాదు నుంచి ఆయా జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి జిల్లాలో వరదల పరిస్థితి సహాయక చర్యలు అడిగి తెలుసుకున్న.

అనంతరం అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరదల వల్ల నష్టం జరిగితే ప్రభుత్వానికి వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించారు. కూలిన ఇండ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కడెం నదిలో గల్లంతైన చేపల కార్మికుడి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా పరిస్థితులపై కలెక్టర్ ప్రాథమిక సమాచారాన్ని మంత్రికి వివరించారు.

వాగులు దాటుతూ.. వంతెనలు ఎక్కుతూ..

ఆదిలాబాద్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షంతో వేల ఎకరాల్లో పంట నష్టంతో పాటు రోడ్లు, వంతెనలు దెబ్బ తినడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యుద్ధ పాతిపదికన పనులు చేపట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం భారీ వర్షంతో దెబ్బతిన్న వరద ముంపు ప్రాంతాలలో ఆదివారం ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

ఆదిలాబాద్ రూరల్  మండలంలోని అంకోలి, తంతో లి, చించుగాట్, లోకారి, వన్ వాట్ తదితరుల ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు. వాగులు వంకలు దాటుతూ, నడుమంటి నీటిలో నుండి వెళ్లి పలు గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు. రైతులు అధైర్య పడవద్దు అంటూ అన్నివిధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ఇప్పటికే ఎకరానికి 40 నుండి 50 వేల పెట్టుబడి పెట్టి మరో నెల రోజుల్లో చేతికం దే పంట నీట మునగడం రైతులను తీవ్ర నష్టానికి గురిచేసిందన్నారు. ప్రకృతి కన్నెర్ర చేయడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం పై అంచనా వేయాలని సూచించారు.

మారుమూల గ్రామాలలో దెబ్బతిన్న రోడ్లు వంతెనలకు యుద్ధ ప్రాతిపదికన మరమత్తులు చేపట్టాలని  సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు దయాకర్, మాడవి రాజు, శ్రీకాంత్, హనుమంతు, ప్రసాద్, కిరణ్ ఉన్నారు.