18-08-2025 01:39:30 AM
ఖరీఫ్, రబీ సాగుపై రైతన్నకు భరోసా
నిర్మల్, ఆగస్టు 17 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో అన్నదాతలు సంబరపడిపోతున్నారు. వానాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా భారీ వర్షాలు లేకపోవడంతో మొన్నటి వరకు సాగునీటి ప్రాజెక్టుల తో పాటు చెరువుల్లో నీరు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వరుణదేవుడు కరుణ కోసం జిల్లా రైతాంగం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ భారీ వర్షాలు రైతులు సాగు చేసుకుంటున్నా ఖరీఫ్ రబీ పంటలకు పూర్తి భరోసా కల్పించనున్నాయి.
నిర్మల్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన కడెం నారాయణరెడ్డి స్వర్ణ ప్రాజెక్ట్ గడ్డన్న శుద్ధ వాగు సదర్ సదర్ మార్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటిమట్టం నిండాయి. ప్రస్తుతం శ్రీరాంసాగర్ మినహా మిగతా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి మిగులు జలాలను వదులుతున్నారు. శ్రీరామ్‌సాగర్‌లో కూడా భారీ స్థాయిలో వరదరావడంతో రేపు గేట్లు ఎత్తి అవకాశం ఉందని అధికారులు ప్రకటించా రు.
శ్రీరామ్ సాగర్ పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1087 అడుగులు చేరింది. 90 టీఎంసీలకుగాను 68 టీఎంసీలు చేరుకోగా గోదావరి పరిహక ప్రాంతం నుండి లక్ష 50 వేల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో మరో రెండు రోజుల్లో పూర్తి నీటి మట్టం నిండునుంది. కడెం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగులను నిలకడగా ఉంచుతూ 18 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.
భైంసా గడ్డన్న గడ్డన్న శుద్ధ వాగు 358.60 అడుగులకుగాను పూర్తిస్థాయిలో నిండుకుంది. స్వర్ణ ప్రాజెక్ట్ 1183.26 అడుగులగాను పూర్తి స్థాయిలో నిండుకోగా గోదావరిపై నిర్మించిన సదరన్ ప్రాజెక్టులో కూడా నీటికల సంతరించుకుంది.
ఈ ప్రాజెక్టులో రెండు రోజుల్లోనే భారీగా వరదరావడం ప్రాజెక్టు నిండిపోవడం రైతులను సంతోషం వ్యక్తం చేస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద సరస్వతి కెనాల్ ద్వారా 36 వేల ఎకరాలు. కడెం ప్రాజెక్టు కింద 38000 స్వర్ణ ప్రాజెక్టు కింద 22,000 గడ్డం సిద్ధబాబు కింద 3000 ఆయకట్టు ఉన్నట్టు రైతులు తెలిపారు.
అలుగు పారుతున్న చెరువులు
నిర్మల్ జిల్లాలోని చిన్న నీటి వనరులైన చెరువుల్లో భారీ వర్షాల కారణంగా చెరువుల్లోకి వరద వచ్చి చెరువులు నిండుకోవడం తో అలుగులు పారుతున్నాయి. జిల్లాలోని కడెం పెంబి సారంగాపూర్ మామడ కుబీర్ కుంటాల తానూర్ నర్సాపూర్ లక్ష్మణ చందా నిర్మల్ రూలర్ దిల్వార్పూర్ తదితర ప్రాంతాల్లో రెండు రోజుల్లో 130 మిల్లీమీట ర్ల మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.
దీంతో అన్ని గ్రామాల్లో చెరువుల్లో నీరు నిండుకోవడంతో ఆయకట్టు కింద వరి సాగుకు పూర్తి భరోసా కరిగింది. జిల్లాలో 580 చెరువులు ఉండగా దాదాపు 476 చెరువులు అలుగు పారుతుండగా మిగతా చెరువుల్లో 80 శాతం నీరు ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ చెరువుల కింద సుమారు 50 వేల ఎకరాలు పంటల సాగు చేయనున్నారు
పెరుగనున్న భూగర్భ జలాలు
నిర్మల్ జిల్లాలో ఒక రెండు రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలో సాగునీటి వనరులన్నీ నిండుకుండలా మారడంతో భూగ ర్భ జలాలు గణనీయంగా పెరగాలంటే అధికారులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం లోతట్టు ప్రాంతాలను జలమే కావడం చెరువులు నిం డిపోవడం వాగులు వొర్రెలు పార డం కారణంగా భూగర్భ జలాలు పెరిగితే రాబోయే వేసవిలో తాగు సాగునీరుకు ఇబ్బంది ఉండదని జిల్లా భూగర్భ జల శాఖ అధికారి శ్రీనివాస్ బాబు తెలిపారు.
ప్రస్తుతం కేవలం 0.70 మీటర్ల నీటి వృద్ధి నమోదయిందని అది సెప్టెంబర్ నాటికి రెండు మీటర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టులు చెరువులు నిండడంతో వీటిపై ఆధారపడ్డ మత్స్యకారుల కూడా జీవనోపాధి పెరిగే అవకాశం ఉంది. న్రిన్న మొన్నటి వరకు ఆందోళనగా ఉన్న వారంతా ఇప్పుడు వర్షాలతో తమ కల నెరవేరి పోతుందన్న సంతోషం వ్యక్తమౌతుంది.