20-11-2025 06:07:03 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో ప్రియదర్శినగర్ సాగర్ రోడ్డు గాజులపేట్ తదితర కాలనీలో గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ హైదర్ ఆధ్వర్యంలో జాడూ చలావు యాత్ర నిర్వహించారు. కాలనీలోకి వెళ్లి వారు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. సిసి రోడ్లు మురికి కాలువలు విద్యుత్ దీపాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అధికారులు వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ సాదిక్ పాల్గొన్నారు.