02-09-2025 12:00:00 AM
కేవలం 116 రూపాయలకు మహా ప్రసాదం
మంగపేట,సెప్టెంబర్01(విజయక్రాంతి ): గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండలంలోని పలు గ్రామాలలో (మంగపేట,గంపోనిగూడెం, కమలాపురం) సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మంగపేట సెంటర్ లోని శ్రీ సమ్మక్క సారక్క యూత్ కమిటీ ఆధ్వర్యంలో పెట్టిన వినాయక మండపం వద్ద విభిన్న రీతిలో గణపతి నవరాత్రుల లడ్డు మహాప్రసాదాన్ని లక్కీ డ్రా ద్వారా భక్తులకు అందజేయాలని శ్రీ సమ్మక్కసారక్క యూత్ కమిటీ వారిని పలువురు ప్రశంసించారు.కూపన్ వెల 116 రూపాయలు తొమ్మిదవ రోజున భక్తుల సమక్షంలో తీసే లక్కీ డ్రా లో గెలుపొందిన భక్తులకు లడ్డు మా ప్రసాదాన్ని అందజేస్తామని కమిటీ వారు తెలిపారు.