08-09-2025 12:30:58 AM
ఆదిలాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి సారిగా గణేష్ దీక్ష మాలధారణ గావించారు. 13 రోజులపాటు నియమ నిష్ఠలతో దీక్షలు చేపట్టగా, ఆంద్రప్రదేశ్ లోని కాణిపాకం గణపతి ఆలయంలో ఆదివారం మాల విరమణ చేయడం జరిగింది. ఈ మహా గణపతి దీక్ష ధరించి మాల విరమణ చేసిన వారిలో మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.
గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆరే రవీందర్, ప్రధాన కార్యదర్శి నానందుల రాజ్ కుమార్, సంయుక్త కార్యదర్శి జోగు రమేష్, గణేష్ ఉత్సవ సభ్యులు జోగు సంతోష్, సంద ప్రభాకర్, ఆరే రమేష్, ముదిరాజ్ సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి దార్శ రవి మాల విరమణ చేశారు.