calender_icon.png 8 September, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి లాభాల్లో 35% వాటాను చెల్లించాలి

08-09-2025 12:32:52 AM

మందమర్రి, సెప్టెంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి, గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో 35 శాతం వాటాను వెంటనే చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి డిమాండ్ చేశారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ఆది వారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సింగరేణి కార్మికుల సొంతింటి కల సాధన కోసం ఈనెల 11,12 తేదిలలో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంటు లలో వినూత్న రీతిలో కార్మికు ల అభిప్రాయాల సేకరణ కోసం ఓటింగ్ నిర్వహించడం జరుగు తుందని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటింగ్ విజయవంతం చేయాలని కోరారు.

హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ సంస్థ సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని, 15న సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాలను కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్,  నాయకులు పాల్గొన్నారు.