calender_icon.png 8 September, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునీకరణ దిశగా..

08-09-2025 12:29:31 AM

  1. త్వరలో బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌కు రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ 

థర్డ్ లైన్‌పై పూర్తయిన సీఆర్‌ఎస్

బెల్లంపల్లి, సెప్టెంబర్ 7 :  బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ దిశలో ముందుకు సాగుతున్నది. ఇప్పటికే అందమైన స్టేషన్‌గా బెల్లం పల్లి రైల్వే స్టేషన్ పేరొందింది. ఈ రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు రైల్వే ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. రైల్వే జనరల్ మేనేజర్ స్థాయి అధికారి తరచూ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శిస్తూ ఉండడం వల్ల అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటూ పను ల్లో నాణ్యత ఉండేలా చూస్తున్నారు.

థర్డ్ లైన్ పనులు కూడా శరవేగంగా చేపట్టారు. బల్లార్షా, బెల్లంపల్లి సెక్షన్ల మధ్య నూతనంగా నిర్మించిన థర్డ్ లైన్‌పై లోకో ట్రయల్ రన్ కూడా అధికారులు నిర్వహించారు. బెల్లంపల్లి, రేచిని రైల్వే స్టేషన్ల మధ్య పది కిలో మీటర్ల వరకు పూర్తి చేసిన థర్డ్ లైన్ పై విద్యుదీకరణ పనులు కూడా పూర్తయ్యాయి. ఆగ స్టు 27న సౌత్ సెంట్రల్ రైల్వే సేఫ్టీ అథారిటీ బోర్డ్ చైర్మన్ మాధవి లత పర్యవేక్షణలో సిఆర్‌ఎస్  పూర్తయింది. 

థర్డ్ లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం నూతన ప్లాట్ ఫామ్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నా యి. థర్డ్ లైన్ ప్లాట్ ఫామ్‌పై ప్రయాణికుల కోసం నూతన షెడ్ నిర్మాణాన్ని చేపట్టేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసే దిశలో అధికారులు తల మునకలవుతున్నారు.

థర్డ్ లైన్ తో పాటు రెండు వైపులా ప్లాట్ ఫాం పొడవునా విద్యుదీకరణ పూర్తిచేసి లైటింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచే పనులు సాగుతున్నాయి. థర్డ్ లైన్ పై రైళ్ల రాకపోకలకు సంబంధించిన సాంకేతిక, సిగ్నల్ వ్యవస్థ, విద్యుదీకరణలకు సంబంధించిన ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణ కోసం సౌకర్యవంతమైన ప్రత్యేక భవన సముదాయాన్ని రైల్వే అధికారులు సిద్ధం చేశారు.

ప్పటికే బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ను ఎంతో అందంగా నిర్మించారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పార్క్ చూడముచ్చటగా, ఆహ్లాదకరంగా ప్రయాణికులను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ రైల్వేస్టేషన్‌లో విశాలమైన పార్కింగ్, అత్యాధుని కమైన అనౌన్స్మెంట్ ప్రత్యేకతలు సంతరించుకుంటుంది. రైల్వే సిబ్బంది నివాసముండేలా ఆధునిక రీతిలో క్వార్టర్స్‌ను నిర్మిస్తున్నారు. 

ప్రయాణికుల రక్షణ, రైల్వే ఆస్తుల పరిరక్షణలో భాగంగా జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్ బల గాల పర్యవేక్షణ ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుం ది. థర్డ్ లైన్ ఏర్పాటుతో పాటు సర్వహంగులను సిద్ధం చేసుకుంటున్న బెల్లంపల్లి రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రయాణికులకు అధునాతన సేవలందించేందుకు అందుబాటులోకి రానుంది.