calender_icon.png 23 October, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా

23-10-2025 01:34:42 AM

అచ్చంపేట అక్టోబర్ 22: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నామని నాగర్ కర్నూల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ నిరంజన్ ముదిరాజ్ తెలిపారు.

ధ ర్నాలో మాజీ ఐఏఎస్ చిరంజీవులు, జస్టిస్ ఈశ్వరయ్య, డా.విశారదన్ మ హారాజ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపా రు. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి సంబంధించి న గోడపత్రికలను ఆవిష్కరించారు. ధర్నాలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. స మావేశంలో ధర్మ సమాజ్ పార్టీ సాయి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.