23-10-2025 01:36:53 AM
-విలేకరుల సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల, అక్టోబర్ 22 : అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు .బుధవారం రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ల సమావేశంలో విలేకరులతో మాట్లాడు తూ గద్వాల నియోజకవర్గంలో ఆర్ అండ్ బి రోడ్లకు మహర్దశ వచ్చిందని, త్వరలో రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేస్తామని తెలిపారు. పదివేల కోట్ల రూపాయలతో 6 వేల కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణకు గురువారం క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు.
అలాగే నవంబర్ 25న నర్సింగ్ కళాశాల భవనం మరియు మెడికల్ కళాశా ల భవన నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందని సమావేశంలో తెలిపారు. ఇందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ,అత్యధిక శాఖ మంత్రి సీతక్క మరియు ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలియజే శారు. నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల పునరుద్ధరణకు రూ..316.45 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమవుతాయని అదేవిధంగా గద్వాల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గద్వాలలో న ర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తి కావడం జరిగింది అని నవంబర్ 25న రాష్ట్ర వైద్య ఆరో గ్యశాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది, దాంతోపా టు 80 కోట్లతో మెడికల్ కాలేజీ భవన ని ర్మాణం భూమి పూజ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. వ్యవసాయ రం గంలో కూడా రైతులు పండించిన వరి ధా న్యంలో గోదాముల్లో నిల్వ ఉంచడానికి గోదాములు కేటాయించడం జరిగిందన్నారు.
గద్వాల నుండి ఇతర ప్రాంతాలకు దా న్యంను సరఫరా చేయడం జరుగుతుంది తె లిపారు. నాపై నమ్మకం ఉంచిన రెండు సా ర్లు గెలిపించిన గద్వాల్ నియోజకవర్గ ప్రజ లు అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం గద్వాల్ నియోజకవర్గంలోని ప్రజల కోసం నా చివరి శ్వాస వరకు గద్వాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంక ట్ రాములు ,మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మురళి, కురుమన్న, నాగు లు యాదవ్,తదితరులు పాల్గొన్నారు.