21-05-2025 12:00:00 AM
అభినందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, మే 20 ) విజయ క్రాంతి): విశాఖపట్నంకు చెందిన ఎఎన్‌ఎస్ 24 టీవీ సంస్ధ ప్ర తి సంవత్సరం వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి ఇస్తున్న ఉగాధి పురస్కారాలలో భా గంగా ఆయుర్వేద వైద్యరంగంలో విశిష్ట సేవలందిస్తునందుకు గాను కరీంనగర్కు చెందిన కాలభైరవ ఆయుర్వేద వైధ్యశాల వైద్యురాలు యమునాకు మహానంది పురస్కారం 2025 ను ప్రక టించింది.
ఇటివల విశాఖపట్నంలోని డా.వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్క్లో జరిగిన కార్యక్రమంలో యమున అవార్డున అందుకున్నారు. మంగళవారం కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్కుమార్ ఆయన కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో యమునను అభినందించి శా లువతో సత్కారించారు. నిరుపేదలకు ఆయుర్వేద వైద్యాన్ని యమునా ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సోసైటి బాధ్యులు కోల అన్నారెడ్డి, తదితరులు పాల్గోన్నారు.