calender_icon.png 6 November, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర ప్రభుత్వం కాసుల వర్షం

06-11-2025 12:00:00 AM

స్మతి, రాధా, జెమీమాలకు ఒక్కొక్కరికి రూ.౨.౨౫ కోట్ల నజరానా

ముంబై, నవంబర్ 5 : మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలతో పాటు రివార్డులు కూడా వెల్లువెత్తు తున్నాయి. జాతీయ జట్టులో ఉన్న తమ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్‌కు ఆయా ప్రభుత్వాలు భారీ నజరానాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం స్మృతి మం ధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్‌లకు భారీ నగదు పురస్కారాలు ప్రకటిం చింది. ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు ఒక్కొక్కరికీ రూ.2.25 కోట్లు నజరానాగా ఇవ్వబోతోంది.

అలాగే మహిళల జట్టు కోచ్ అమోల్ మజుందార్‌కు రూ.22.5 లక్షల క్యాష్ ప్రైజ్ అందజేయనుంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం తమ క్యాబినెట్ మీటింగ్‌లో భారత జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకుంది. తమ ప్రభుత్వ క్రీడాపాలసీ ప్రకారం ఘనంగా సత్కరించి నగదు పురస్కారాలు అందజేస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నివస్ చెప్పారు. ఈ ముగ్గురూ తమ రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. వరల్డ్‌కప్, వరల్డ్ చాంపియన్‌షిప్, పా రా వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో గోల్డ్ మెడల్ గెలిస్తే రూ.2.25 కోట్లు, కోచ్‌లకు రూ.22.5 లక్షలు మహారాష్ట్ర నజరానాగా అందిస్తోంది.