calender_icon.png 6 November, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంట్నర్ మెరుపులు వృథా.. విండీస్‌దే తొలి టీ20

06-11-2025 12:00:00 AM

ఆక్లాండ్, నవంబర్ 5 : న్యూజిలాండ్ పర్యటనను వెస్టిండీస్ విజయంతో ఆరంభించింది. తొలి టీ ట్వంటీలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అభిమానులను ఉత్కంఠతో ఊపేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు నిరాశపరిచినా షై హోప్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ రాబిన్‌సన్(27),రచిన్(21) ధాటిగా ఆడడడంతో సునాయాసంగా గెలిచేలా కనిపించింది.

అయితే మిడిల్ ఓవర్లలో విండీస్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టారు. దీంతో 107/9 రన్స్‌తో ఓటమి అంచున నిలిచింది. ఈ దశ లో కెప్టెన్ శాంట్నర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే 55(8 ఫోర్లు,2 సిక్స ర్లు) రన్స్‌తో గెలిపించేందుకు ప్రయత్నించాడు. చివర్లో విండీస్ బౌలర్లు కట్టడి చేయడంతో కివీస్ 157 పరుగులే చేయగలిగింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీ స్‌లో విండీస్ 1 ఆధిక్యంలో నిలిచింది.