10-09-2025 01:59:06 AM
జీహెఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): నగరంలోని పురాతన జియాగూడ స్లాటర్ హౌజ్ కబేళా ఆధునికీకరణ పనులను తక్షణమే ప్రారంభించాలని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. కార్వాన్ సర్కిల్‌లోని జియాగూడ స్లాటర్ హౌజ్ కబేళాలో నెలకొన్న పరిస్థితులను మంగళవారం క్షేత్రస్థా యిలో పరిశీలించిన ఆయన..
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. స్లాటర్ హౌజ్ ఆధునికీకరణకు వెంట నే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలి అని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఆయన వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్ ఉన్నారు. ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త, నిర్మాణ వ్యర్థాలను చూసి అసహనం వ్యక్తం చేసిన కమిషనర్, వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు.
సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి కాళోజీ
ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ సమాజాన్ని తన కవితలతో, అక్షరా లతో జాగృతం చేసిన మహనీయుడని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ కొనియా డారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సంద ర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ యాసకు, భాషకు అస్తిత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కాళోజీ అన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ గీతా రాధిక, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్, విజిలెన్స్ అదనపు ఎస్పీ సుదర్శన్, డీఎస్పీ నరసింహరెడ్డి, పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తదితరులు పాల్గొని కాళోజీకి నివాళులర్పించారు.