calender_icon.png 10 September, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరమ్మతులు ఎప్పుడు?

10-09-2025 12:08:40 AM

-వర్ష బీభత్సానికి శ్మశానానికి వెళ్లే రోడ్డు ధ్వంసం 

-వరద ధాటికి కొట్టుకుపోయిన రోడ్డు

-అంత్యక్రియలకు ఇబ్బందులు పడుతున్న జనం

-పట్టింపు లేనట్టు అధికారుల వ్యవహారం

కామారెడ్డి, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) ః కామారెడ్డి స్మశానానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు పూర్తిగా మూడు చోట్ల సీసీ రోడ్డు ధ్వంసం అయింది, ద్విచక్ర వాహనాలు గాని, ఫోర్ వీలర్స్ వాహనాలు, నడుచుకుంటా వెళ్లేందుకు కూడా రోడ్డు అనువుగా లేకుండా గుంతలు పడ్డాయి.భారీ వరదల వల్ల రోడ్లు కొట్టుకుపోయాయి.

వరదల వల్ల కొట్టుకపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్న మున్సిపల్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు కామారెడ్డి స్మశాన వాటికకు వెళ్లే రోడ్డు గురించి మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం ఈ రోడ్డు దుస్థితి గురించి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లలేదంటే మున్సిపల్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒకటి రెండు శవాలు ఈ స్మశాన వాటికకు వస్తున్నాయి. స్మశానానికి శవాన్ని తీసుకు రావడానికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

అంతేకాకుండా వారి బంధువులు నడుచుకుంటూ వెళ్లాలంటే కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. గత 15 రోజులుగా రోడ్డు ధ్వంసమైన తాత్కాలిక మరమ్మతులు కూడా మున్సిపల్ అధికారులు చేపట్టలేదు. కనీసం ఆ రోడ్డు వైపు కన్నెత్తి చూడలేదు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారుల తీరుపై కామారెడ్డి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరానికి ఉపయోగపడే స్మశాన వాటిక రోడ్డు మరమ్మత్తులపై నిర్లక్ష్యం వహించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కనీసం తాత్కాలిక మరమతమైన చేపట్టి స్మశానానికి వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లకుండా కప్పిపుచ్చుకోవడం పై మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిసి రోడ్లు ధ్వంసం కావడంతో నడుచుకుంటూ వెళ్లేందుకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. కనీసం మొరం పోసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కనీసం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మేలుకొని తాత్కాలిక మరమ్మతులు చేపడతారా లేదో వేచి చూడాల్సిందే.

తాత్కాలిక మరమ్మతులు చేపడతాం...

కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ లోని స్మశాన వాటిక రోడ్డు భారీ వరదల వల్ల పలుచోట్ల కొట్టుకపోయి ధ్వంసం అయింది. త్వరలోనే తాత్కాలిక మరమ్మతులు చేపడతాం. మొరం వేసి తాత్కాలికంగా ఉపయోగంలో కి తీసుకు వస్తాం.

- రాజేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి