12-03-2025 01:48:08 AM
యుద్ధప్రాతిపదికన చెరువు కట్ట సుందరీకరణ పనులు
ఖానాపూర్, మార్చి 11 ః ఎట్టకేలకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు ఫలించాయి.ఈ మేరకు నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మున్సిపాలిటీ లోని, బొడ్డోని కుంట చెరువుకు మహర్దశ పట్టింది. దుర్గంధం చెత్త ,చెదారం నిండి, వుండి దుర్వాసన వెదజల్లే ఈ చెరువు ను, బాగు చేసి ప్రజల ఉపయోగార్థం అందుబాటులో కి తేవాలని డిమాండ్ ఉండగా, ప్రస్తుతం అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు, చెరువు సుందరీకరణ పనులు చేపట్టడంతో, పట్టణ ప్రజలకు ఆహ్లాదానికి మరొక వనరు అందుబాటులో కి రానుంది.
గడిచిన దశాబ్ద కాలంగా పట్టణంలోని ఈ చెరువు ను మినీ ట్యాంక్ బండ్ చేయాలని, ప్రజలు డిమాండ్ వినిపిస్తున్నప్పటికి, అప్పటి ప్రభుత్వం ఇదిగో, అదిగో అంటూ తాత్సారం చేసిన పరిస్థితులు ఉండగా, ప్రస్తుతం అధికారులు చొరవ చూపడంతో, ప్రజలకు ఆ కొరత తీరనుంది.
ఈ మేరకు, గత నెలలో, ఖానాపూర్ మున్సిపాలిటీ పదవ వార్డులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేపట్టిన స్వచ్ఛ నిర్మల్ కార్యక్రమంలో భాగంగా, ఈ బొడ్డోని కుంట చెరువు ను సందర్శించి, యుద్ధ ప్రాతిపదికన చెరువును శుద్ధిచేసి, కట్టను చదును చేసి, చెట్లు, బెంచీ,లు విద్యుత్ దీపాలు, ఏర్పాటు చేయాలని, దానికి తగిన నిధులు తాను సమకూరుస్తానని, స్థానిక మున్సిపల్ అధికారులకు ఆదేశించడంతో, అధికారులు స్పందించి, మంగళవారం చెరువు సుందరీకరణ పనులు చేపట్టారు.
ఈ మేరకు, కమిషనర్ జాదవ్ కృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం నీటిని శుద్ధి చేసి ,చెత్తాచెదరం తొలగించి, ఈనెల చివరి వరకు, చెరువులో పూడిక తీసి, సకల హాంగులతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువు సుందరీకరణ పూర్తి చేస్తామని అన్నారు.
ఎట్టకేలకు కలెక్టర్ ఆదేశాలు ఫలించి, పట్టణ అభివృద్ధిలో భాగంగా, చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తున్నందుకు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు, పట్టణంలోని రోడ్డు వెడల్పు ,రింగ్ రోడ్లు ,పనులు పూర్తి చేస్తే, బాగుంటుందని, ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సుందరీకరణ పనులను మున్సిపల్ సిబ్బంది మానాల శంకర్ పర్యవేక్షిస్తున్నారు.