calender_icon.png 17 September, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్‌లో ‘మధ్యాహ్న’ బిల్లులు వచ్చే నెల నుంచి చెల్లింపులు

17-09-2025 01:00:31 AM

  1. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాల్లో ప్రారంభం
  2. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన బిల్లులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో చెల్లించనున్నారు. బిల్లు లు ఎప్పుడొస్తాయోనని ఎదురుచూసే పరిస్థితికి విద్యాశాఖ పుల్‌స్టాప్ పెట్టనుంది. పెద్దపలి, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపులను ఇప్పటికే విజయవంతంగా ప్రారంభించినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ మంగళవారం ఆయనను కలిసిన విలేకరులతో తెలిపారు.

ట్రెజరీ ద్వారా మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ఆలస్యమవుతోందని, ఈ క్రమంలోనే నేరుగా ఆన్‌లైన్ నుంచే బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించనున్నారు. అలాగే విద్యార్థులకు అందించే భోజనం (రైస్), రాగిజావ పంపిణీ కేంద్రాల నుంచి పాఠశాలలకు వెళ్తున్నాయా? లేదా? తెలుసు కునేలా ట్రాక్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.