calender_icon.png 17 September, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో కదనోత్సాహం!

17-09-2025 12:25:54 AM

  1. జిల్లాల వారీగా జంబో కమిటీలు
  2. డీసీసీ కార్యవర్గ కూర్పు సిద్ధం
  3. సామాజికవర్గాల వారీగా పదవుల ఆమోదం తెలిపిన టీపీసీసీ 
  4. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన 
  5. ఆసక్తిగా ఎదురుచూస్తున్నపార్టీ నేతలు 

రంగారెడ్డి, సెప్టెంబర్16( విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పీసీసీ పదవులపై దృష్టి సారించింది. డీసీసీని బలోపేతం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. అధికార కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రణాళిక ప్రకారంగా ఆచితూచి అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దాదాపుగా రెండేళ్ల దగ్గర పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పార్టీ పదవులు నామినేషన్లపై పోస్టుల భర్తీపై పెద్దగా దృష్టి సారించలేదు.

పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు క్షేత్రస్థాయిలో కష్టపడిన నేతలు కార్యకర్తలకు పదవులు దక్కకపోవడంతో వారిలో కొంత నిరుత్సాహం దాపురించింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కొందరికి నామినేషన్ పోస్టులు దక్కగా మిగతావారు కొంత నారా జ్‌గా ఉన్నారు.

అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ను సభలు సమావేశాల్లో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని వారిలో కొంత ఉత్సా హం నింపుతూ వచ్చారు. అప్పటినుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు నామినేషన్ల పదవులు పార్టీపదలో కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరి ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ లేదా పార్టీ పదవులు దక్కుతాయనే వారిలో ఆశ కొట్టుమిట్టాడుతుంది. 

ఎమ్మెల్యేల చేతుల్లో..

స్థానిక ఎమ్మెల్యేల ద్వారా అర్హులైన పార్టీ నాయకులు కార్యకర్తలకు పదవులు కేటాయించేందుకు ఇప్పటికే ఆయా మండలాల నుంచి పూర్తిస్థాయి జాబితాను పిసిసి తెప్పించుకుంది. జిల్లా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేల సలహా మేరకు డీసీసీ కమిటీ, నామినేటెడ్ పదవుల భర్తీ కోసం వారి నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో డిసిసి కార్యవర్గ కోరుకున్న సిద్ధం చేశారని పీసీసీ సైతం అట్టి కమిటీని అమోద ముద్ర వేసినట్లు విశ్వసనీయ సమాచారం. డిసిసి అధ్యక్షుని ఎంపిక మాత్రం ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు కల్వకుర్తి, షాద్ నగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు, మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, మల్కాజ్ గిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి నియోజకవర్గాల నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జి నేతల నుంచి  ఆశావహుల జాబితా ఇప్పటికే పీసీసీకి  చేరింది. పీసీసీ కార్యాలయం నుంచి పార్టీ ముఖ్య నేతలు  అభ్యర్థులకు సైతం ఫోన్లు చేసి  వారి బయోడేటా వివరాలను సైతం కన్ఫామ్ చేసుకున్నట్లు సమాచారం.

సామాజికవర్గాల కూర్పు 

 పార్టీ పదవుల ఎంపికలో ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల తూర్పు పైనే ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ఓసీ వర్గాలను డీసీసీ కమిటీలో  స్థానం కల్పించింది. పార్టీ పదవుల ఎంపికలో  ఎక్కడ నేతల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా  ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గ, పార్లమెంట్ ఇన్చార్జి ల అభిప్రాయాలను క్రోడీకరించింది. ప్రధానంగా పార్టీ కోసం కష్టపడిన నేతలు, పార్టీని సమన్వయం చేస్తూ అధికారంలోకి తీసుకొచ్చేలా కృషిచేసిన నేతలకు  పార్టీ పదవిలో ప్రయారిటీ దక్కనుంది. స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన టార్గెట్ గా డిసిసి కమిటీ ఎంపిక చేశారు.

జిల్లాలో పార్టీ పదవులు ఎందుకు ఎంపిక చేసామో, అక్కడ క్షేత్రస్థాయి పార్టీ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల టాస్క్, భవిష్యత్తు వాటిని బలోపేతం చేసేందుకు డీసీసీ కమిటీ ఎంపిక అనంతరం  కార్యవర్గానికి పీసీసీ అధ్యక్షుడు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ పదవులు ఇలా కేటాయించనున్నారు. డిసిసి ప్రెసిడెంట్ తో పాటు ఈ దపా అసెంబ్లీకి వైస్ ప్రెసిడెంట్, స్పాక్స్ పర్సన్, ఇద్దరు జనరల్ సెక్రటరీలు, మండల పార్టీ అధ్యక్షుడుతో పాటు జనరల్ సెక్రెటరీ గ్రామస్థాయి కమిటీలు నియమించనున్నారు. 

ఆరు గ్యారెంటీల అమలుపై..

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనంతరం ఆరు గ్యారెంటీలు అమలు, ప్రజాపాలన, విద్య,వైద్యం, సంక్షేమ పథకాల అర్హులకు అందేలా ప్రభుత్వం చేస్తున్న కృషిని పార్టీ నేతలంతా ఇకనుంచి క్షేత్రస్థాయిలో సంచరిస్తూ ప్రజలకు మరింత చెరువు అయ్యేలా నూతన కమిటీకి ప్రత్యేక టాస్క్ ఇవ్వనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే  స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటూ ఇటీవలనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన సైతం చేశారు.

దానిలో భాగంగానే స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపిలకు  భంగపాటు  అయ్యేలా పిసిసి కొత్త ప్రణాళికలు రచిస్తుంది. రాష్ట్రంలో సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు తమ పార్టీ ఖాతాలో వేసుకునేలా  ఇప్పటికే క్షేత్ర స్థాయిలో  డిసిసి జిల్లా ఇన్చార్జి,మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  కొత్తగా పార్టీ పదవులు వచ్చే నేతలకు ప్రధానంగా పార్టీ జెండా ఎజెండాపై పిసిసి అధ్యక్షుడు  వివరించి ఆ దిశగా పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయి.