calender_icon.png 17 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినియోగదారులకు మదర్ డెయిరీ శుభవార్త

17-09-2025 01:02:38 AM

  1. సవరించిన జీఎస్టీ రేట్ల ఫలితం 
  2. పాలు, వెన్న, నెయ్యి ధరలు తగ్గింపు
  3. ప్యాకెట్ సైజ్‌ను బట్టి రూ.2 నుంచి గరిష్ఠంగా రూ.30 వరకు తగ్గుదల
  4. ఈ నెల 22 నుంచి అమలులోకి ధరలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు మదర్ డెయిరీ ఊరటనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను సవరించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు వర్తింపజేయాలని మదర్ డెయిరీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. దీనిలో భాగంగా పాలు, పనీర్, నెయ్యి, బటర్, చీజ్ వంటి పాల ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

సంస్థ తాజా నిర్ణయం మేరకు పాల ఉత్పత్తుల ప్యాకెట్ సైజును బట్టి రూ.2 నుంచి గరిష్ఠంగా రూ.30 వరకు ధరలు తగ్గనున్నాయి. తగ్గించిన ధరలు ఈ నెల 22వ తేదీ నుంచి అములులోకి వస్తాయని డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీశ్ బాండ్లిష్ మంగళవారం తెలిపారు. గత సంవత్సరం రూ.17,500 కోట్ల టర్నోవర్ నమోదు చేశామని, తాజా నిర్ణయంతో మార్కెట్‌లో తమ స్థానం మరింత సుస్థిరమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ధరల తగ్గుదల ఇలా..

లీటర్ నెయ్యి కార్టన్ ప్యాక్ ధర రూ.675 ఉండగా, ఆ ధర రూ.645కు తగ్గనున్నది. లీటర్ నెయ్యి టిన్ ధర రూ.750 ఉండగా రూ.720కి తగ్గనున్నది. 500 గ్రాముల బటర్ ప్యాకెట్ ధర రూ.305 ఉండగా, అది రూ.285కి దిగివచ్చింది. 480 గ్రాముల చీజ్ స్లైసెస్ ప్యాకెట్ ధర రూ.405 ఉండగా రూ.380కి తగ్గింది. 180 గ్రాముల చీజ్ క్యూబ్స్ ప్యాకెట్ రూ.145 ఉండగా, రూ.135కు దిగివచ్చింది. 200 గ్రాముల సాధారణ పనీర్ ప్యాకెట్ ధర రూ.95 నుంచి రూ.92కి, 200 గ్రాముల మలాయ్ పనీర్ ప్యాకెట్ ధర రూ.100 నుంచి రూ.97కి తగ్గింది.