calender_icon.png 17 September, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో ఘర్ వాపసీ షురూ..

17-09-2025 01:14:11 AM

ఆదిలాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాం తి):  ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఘర్ వా పసీ కార్యక్రమం మొదలయ్యింది. కాంగ్రెస్ పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలో చేర్చేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకు లు  ఎట్టకేలకు సొంతగూటికి చేరారు. మంగళవారం హైదరాబాదులో టీపీసీసీ అధ్యక్షు లు మహేష్ కూమార్ గౌడ్ ఆద్వర్యంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు,

టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజా త, డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి లు తిరిగి కాంగ్రెస్ లో చేరారు. దింతో వారికి టీపీసీసీ అధ్యక్షుడు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లకు పార్టీలో చేరిన వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పారీ కి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు.