calender_icon.png 17 September, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

17-09-2025 01:12:44 AM

రాష్ట్ర మహిళ, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు హేమలత అగర్వాల్           

ఇచ్చోడ, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, చక్కగా చదువుకొని ఉజ్వలమైన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని రాష్ట్ర మహి ళ, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు హేమలత అగర్వాల్ అన్నారు. మంగ ళవారం ఇచ్చోడ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని తర గతి గదులను,  పాఠశాల గ్రౌండ్ ను పరిశీలించారు. విద్యార్థిని  విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం హేమలత అగర్వాల్  మాట్లాడుతూ... పిల్లలను తల్లిదండ్రులు ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని, మీరు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకుం టు సమాజానికి మార్గదర్శకులుగా నిలవలన్నారు.

మీకేమైనా సమస్యలుంటే 1098కి నిరంతరంగా ఫోన్ చేసి చెప్పవచ్చు అని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ జిల్లా అధికారి రాజేంద్రప్రసాద్, సెక్రటరీ మధురవాణి, సెక్టోరియల్ తిరుపతి, సోషల్ వర్కర్ రవికాంత్ పాల్గొన్నారు.