08-07-2025 02:01:54 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 7 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్, లిరోస్ టెక్నాలజీస్, తెలంగాణ టీపీవో అసోసియేషన్ (టీటీపీఓఏ), స్టార్టెక్ సహకారంతో సోమవారం డిగ్రీ, పీజీ విద్యార్థులకు మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
2022, 2023, 2024, 2025 విద్యా సంవత్సరాలకు చెందిన వివిధ కోర్సులకు చదివిన విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొ న్నారు. ఈ కార్యక్రమానికి రెవరెండ్ ఫాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ వినయ్, ‘ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ ధోరణులతో మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి, లేకపోతే పాతబడిపోయే ప్రమాదం ఉంది‘ అని విద్యార్థులను కోరారు. టీటీపీఓఏ అధ్యక్షుడు డాక్టర్ జయరామ్ నైపుణ్యం ఆధారిత నియామకం, పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజేశారు. లిరోస్ టెక్నాలజీస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సందీప్ పరిశ్రమ అంచనాలను విద్యార్థుల సంసిద్ధతతో సమలేఖనం చేయడాన్ని నొక్కి చెప్పారు.