calender_icon.png 22 November, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌పై ముగిసిన విచారణ

25-07-2024 09:51:05 PM

హైదరాబాద్:  ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పై కోర్టు విచారణను ముగించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్వీకర్ ను మహేశ్వర్ రెడ్డి కోరారు. తన ఫిర్యాదును స్పీకర్ స్వీకరించటం లేదని మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తన ఫిర్యాదును స్వీకరించేలా ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.  దీనిపై స్పందించిన కోర్టు మహేశ్వర్ పిటిషన్ ను తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించింది. ధ్రువీకరణ రసీదును పిటిషనర్ కు ఇవ్వాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది.