calender_icon.png 22 November, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై విచారణను వాయిదా వేసిన హైకోర్టు

25-07-2024 10:14:04 PM

హైదరాబాద్ : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టులో మరోసారి గురువారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారని ఏజీ పేర్కొన్నారు. స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని... కోర్టుల జోక్యం ఉండదన్నారు.

గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందన్న ప్రతివాదుల తరపు న్యాయవాదులు గుర్తు చేశారు. స్పీకర్ కు ఫిర్యాదు చేసిన 10 రోజుల్లోనే హైకోర్టును ఆశ్రయించారని, 3 నెలలైనా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని ఏజీ తెలిపారు. వివాదం కోర్టులో ఉన్నందున పిటిషన్లను స్వీకర్ పరిశీలించలేదని, కోర్టు నిర్ణయం కోసం వేచిచూస్తున్నారేమోనన్ని ఏజీ ధర్మసనానికి వెల్లడించారు. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.