calender_icon.png 22 November, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆర్థిక ఉన్నతితో రాష్ట్ర ప్రగతి సాధ్యం

22-11-2025 12:00:00 AM

- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

- తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి శ్రీకారం

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 21 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక ఉన్నతితో రాష్ట్ర ప్రగతి సాధ్యం అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వే ములవాడ రూరల్ మండలం నూకలమర్రి,అర్బన్ మండలం రుద్రావరం గ్రామా ల్లో మహిళా ఉన్నతి.తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ మహిళలకు చీరలు పంపి ణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మా ట్లాడారు. ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం గా ముందుకు సాగుతున్నారని వివరించా రు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆనాడు పేద ప్రజలకు గరీబి హఠావో, బ్యాంకుల జాతీయకరణ లాంటి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేశారని అన్నా రు.

రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో లక్ష 45 వేల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. మహి ళా సంఘాలలో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెం పు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి

ముంపు గ్రామాల ప్రజలను గత ప్రభు త్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు..ప్రజా ప్రభుత్వంలో ముంపు గ్రామాల పరిధిలో 4696 ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షల మం జూరు పత్రాలు ప్రజలకు పంపిణీ చేశామని చెప్పారు.ముంపు గ్రామాల ప్రజల బాధలు తెలిసిన వాడిగా ముంపు గ్రామాల సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు..అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృ ద్ధి సంక్షేమం ఎక్కడ కూడా ఆపలేదని పేరుకొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తె లంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్నం బి య్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. స్వంత ఇంటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, జిల్లాలో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని తె లిపారు. ఇందిరా మహిళా చీరల ఉత్పత్తి ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సాధికారతకు ఉ పయోగపడుతుందని,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలకు అందజేసే చీరలు జి ల్లాలో ఉత్పత్తి కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఎస్ హెచ్ జీ ల్లో ప్రస్తుతం 18- 59 ఏండ్ల వారికి అవకాశం ఉందని, ప్ర భుత్వం ఇప్పుడు 15-18 ఏండ్ల కిశోర బాలికలకు, 60 ఏండ్ల వయసు పైబడిన వారికి కూ డా సంఘాలు ఏర్పాటు చేసే అవకాశం క ల్పించిందని తెలిపారు. సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు,ప్యాక్స్ ఛైర్మెన్ రేగలపాటి కృష్ణదేవరావు,డీఆర్డీఓ శేషాద్రి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వకులభరణం శ్రీనివాస్,పిల్లి కనకయ్య,మాజీ సర్పంచులు రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షులు వేములవాడ అర్బన్ మండల సర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షులు రుద్రవరం మాజీ సర్పంచ్ ఊరడీ రామురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.