calender_icon.png 25 November, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థికంగా బలపడేందుకు మహిళా శక్తి పథకం

25-11-2025 12:31:46 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, నవంబర్ 24(విజయక్రాంతి):మహిళామణులు ఆర్థికంగా బలపడేందుకు స్వయం సమృద్ది సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గ్ మండలం, రేగోడు, టేక్మాల్ మండలాలకు సంబంధించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఆర్డీవో రమాదేవి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కలెక్టర్ ముఖ్యఅతిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.500 కోట్లు రుణాలు బ్యాంకు లింకేజీ ద్వారా అందించామన్నారు. ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సబ్సిడీ 13 కోట్ల రూపాయలను లక్ష 26 వేల కుటుంబాలకు అందించామన్నారు. జిల్లాలో 9,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి, మహాలక్ష్మి ద్వారా మహిళకు ఉచిత ప్రయాణం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాను మహిళల అందించి వారిని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీతో పండుగ వాతావరణం.. నెలకొందని చెప్పారు.

మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి అనే కార్యక్రమం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఉత్సవంలా పండుగలా ఊరూరా నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత మహిళలకు తొలి విడతలో చీరలను పంపిణీ చేస్తున్నారని, పట్టణ ప్రాంతాలలో మార్చి 1వ తేదీ నుండి వారం రోజుల పాటు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు.

అనంతరం అల్లాదుర్గ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కార్యాలయాన్ని పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికలను పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు.