15-09-2025 12:00:00 AM
చారకొండ సెప్టెంబర్ 14 : మండలంలోని తుర్కలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్న మైపాల్ నాయక్ లయన్స్ ఇంటర్నేషనల్ ఉ త్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. మ హబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలోని అన్నపూర్ణ గార్డెన్ లో ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికైన ఉపాధ్యాయులకు లయన్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఉ పాధ్యాయ వృత్తిలో అత్యుత్తమ సేవలు అం దించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో లయన్స్ ఇంటర్నేషనల్ వారు గుర్తించి శాలువాతో సన్మానించి ప్రశంస పత్రంతో పాటు మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా మండలంలోని ఉపాధ్యాయులు హెచ్‌ఎం మహిపాల్ నాయక్ ను అభినందించారు.