calender_icon.png 1 November, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి

31-10-2025 10:51:38 PM

నాగర్‌కర్నూల్‌,(విజయక్రాంతి): విద్యారంగ అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్సి కూచుకుల్ల దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన టిఎస్ పిఆర్టియు జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు.  ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాలలు సమస్యలు లేని వాతావరణంలో పని చేసినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా విన్నానని, వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రికి విన్నవిస్తానని హామీ ఇచ్చారు. నాగర్‌ కర్నూల్‌ను విద్యా కేంద్రంగా ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉపాధ్యాయులు కూడా సహకరించాలన్నారు.