31-10-2025 10:55:51 PM
పెద్దపల్లి గౌరెడ్డిపేట గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు
పెద్దపల్లి,(విజయక్రాంతి): ఇటుక బట్టి యజమాని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో విద్యుత్ షాక్ తో దాగేటి మల్లేష్ ( 28 ) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే గౌరెడ్డిపేట గ్రామ శివారులో గల ఎమ్మెస్సార్ ఇటుక బట్టి వద్ద మేకలు మేపడానికి వెళ్లిన యువకుడు విద్యుత్ శాఖ, ఇటుక బట్టి యజమాని నిర్లక్ష్యంతో క్రింద వేలాడుతున్న విద్యుత్ వైరుకు గొర్రె తాకి కిందపడగా దానిని కాపాడబోయి దాగేటి మల్లేష్ అనే యువకుడు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గౌరెడ్డిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు సంఘటన స్థలానికి వెళ్లి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే రూరల్ ఎస్సై మల్లేష్ సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.