31-10-2025 10:48:28 PM
ఉత్సాహంగా పాల్గొన్న విస్డం హైస్కూల్ విద్యార్థులు
చిగురుమామిడి,(విజయక్రాంతి): దేశ ఐక్యతను చాటేం దుకే, యువతను ఉత్తేజపరిచేందుకే పోలీసుల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని ఐక్యత యాత్ర(రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చిగురుమామిడి ఎస్ఐ రేణికుంట సాయికృష్ణ తెలిపారు. చిగురుమామిడి ఎస్ఐ సాయి కృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని బొమ్మనపల్లి విస్డం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అధ్యాపక బృందం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు.
విస్డం హైస్కూల్ కు చెందిన దాదాపు 350మంది విద్యార్థులు ఐక్యత జాతీయ ఏకత అనే సందేశాలతో నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు తెలిపారు. జాతీయ భద్రత, చట్ట సూక్షణ, ప్రజా అవగాహన ఐక్యత అనే విలువలను ప్రతిబింబించే ఈ కార్యక్రమం స్థానిక ప్రజలతో విశేష స్పందనను రేకెత్తించిందన్నారు. జాతీయ సమైక్యతకు పటేల్ చేసిన కృషి మరువలేనిదని పలువురు గుర్తు చేశారు.