17-08-2025 11:15:12 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): నగరంలోని 45వ డివిజన్ తరాలపల్లి గ్రామంలో మైసమ్మ తల్లి కట్టమీదికి పోవడానికి అడ్డుగా ఉండడంతో రైతులు ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు జెసిబి సాయంతో ఆదివారం ముళ్ళ పొదలను తొలగించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ముళ్ళ పొదలను తొలగించారు. రైతులు వనభోజనాలకు వెళ్లే ప్రజలు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ముదిరాజు కుల పెద్దలు, రైతులు, ప్రజలు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.