18-08-2025 12:00:00 AM
కామారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి) ః ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవలసిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు దొరకడం శాపంగా మారుతున్నాయి. డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కొనుక్కోవాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. ఒకవైపు వస్తువుల కల్తీ తోపాటు ఆరపదార్థాల కల్తీ ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 200 కు పైగా హోటల్లు, 20 పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. మంచి ఆహారం దొరుకు తుందని ఆశతో చిన్న చిన్న ఫంక్షన్లకు కుటుం బ సభ్యులతో కలిసి డబ్బులు ఖర్చయినా పర్వాలేదు, రెస్టారెంట్కు వెళ్దాం అనుకుంటున్నా. మధ్యతరగతి, ప్రజలకు డబ్బులు పెట్టి అనారోగ్యాలను తెచ్చుకునే పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి.
దీంతో హోటలలో, రెస్టారెంట్లలో భోజనాలు చేయాలన్న నాణ్యతమైన ఆహారం లభిస్తుందన్న అవకాశం లేకుండా పోతుందని పలువురు వా వాపోతున్నారు. ఇటీవల హోటల్లు, రెస్టారెంట్లలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టగా కుళ్ళిన ఆహా ర పదార్థాలు, మాంసము, చికెన్, మటన్, లు పలు హోటలలో, రెస్టారెంట్లో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో బయటపడ్డాయి.
డబ్బుపై ఉన్న వ్యామోహం
కస్టమర్లపై లేదు
హోటల్లు నిర్వాకులు, రెస్టారెంట్ల నిర్వహకులు ఎంతో డబ్బులు పెట్టి నిర్వహిస్తున్న ప్రజలకు నాణ్యత గల ఆహారాన్ని అందించడంలో శ్రద్ధ చూపడం లేదు. కస్టమర్లకు నాణ్యత గల ఆహారాన్ని అందించాల్సి ఉండ గా డబ్బులు తీసుకోవడం పట్ల ఉన్న శ్రద్ధ కస్టమర్లకు నాణ్యత గల ఆహారం అందించడంలో అశ్రద్ధ వహిస్తున్నారు. పర్యవేక్షిం చాల్సిన ఆహార భద్రతాధికారులు మామూళ్లకు అలవాటు పడి పర్యవేక్షణ చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నెలకు ఒక రోజు కూడా తనిఖీలు చేపట్టడం లేదని ప్రజ లు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మున్సిపాల్టీ లలో, కార్పొరేషన్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ లు ఉండాల్సి ఉండగా జిల్లా కేంద్రంలో మాత్రమే ఉన్నారు. ఉమ్మ డి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 200 పైగా హోటల్లు, 20కి పైగా రెస్టారెంట్లు ఉన్నా యి. వాటిని పర్యవేక్షించడానికి సరైన ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేక ఉన్నవారు సమయం సరిపోవడంలేదని ఆహార భద్రత అధికారులు అంటున్నారు. సరైన సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని జిల్లాకు ఒకరు ఉంటే ఏ రకంగా న్యాయం చేస్తామని ఫుడ్ ఇన్స్పెక్టర్ లు చెప్తున్నారు. కనీ సం తమకు కార్యాలయాలు కూడా లేవని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా తనిఖీలు చేస్తామని అంటున్నారు. తప్పకుండా టైం లో తనిఖీలు చేపడుతున్నామని నాణ్యత లేకపోతే హోటల్లు యజ మానులపై, రెస్టారెంట్ల యజమానులకు ఫైన్‌లు వేస్తున్నామని చెబుతున్నారు.
డబ్బులు పెట్టిన నాణ్యతలేని ఆహారం
ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాప్రజలకు మంచి ఆహారం లభించాలని ఉద్దే శంతో కుటుంబ సభ్యులతో కలిసి డబ్బులు ఎంత ఖర్చునా మంచి ఆహారాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవాలని ఉద్దేశంతో హోటల్లు, రెస్టారెంట్లకు వెళ్లి భోజనాలు చేస్తుంటే నాణ్యత గల ఆహారం లభించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లేక, నిర్లక్ష్యం వల్ల నాణ్యత ప్రమాణాలు హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు పాటించడం లేదు. డబ్బుపై ఉన్న శ్రద్ధ కస్టమర్లకు నాణ్యమైన హారాన్ని నాణ్యత గల ఆహారాన్ని అందించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి నిజామా బాద్, కామారెడ్డి జిల్లాలో నెలకొని ఉంది. హోటల్లు, రెస్టారెంట్లపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ చేస్తే ప్రజలకు నాణ్యత గల ఆహారం లభిస్తుంది. అధికారులు పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా తమ విధులు నిర్వర్తిస్తుం డడంతో హోటల్లో, రెస్టారెంట్ల యజమానులకు ఆడింది ఆట, పాడింది పాట లాగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, జిల్లాలోని ఆర్మూర్, బోధన్, పట్టణాల్లో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పట్టణాలతోపాటు జుక్కల్, పిట్లం, మదునూరు, లింగంపేట్, బిబిపేట్, మాచారెడ్డి, రామారెడ్డి, గాంధారి మండలాల్లో హోటల్లు ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో హోటళ్ల నిర్వాహకులు హోటల్‌లను నిర్వహిస్తున్నారు. డబ్బులు పెట్టి భోజనాలు చేసేందుకు వెళ్లిన వారికి చుక్కలు చూడాల్సి వస్తుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల అడ్రస్ ఎక్కడ అంటూ ప్రజలు వా పోతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు నిర్రక్షంగా విధులు నిర్వర్తించడంతో నాణ్యతలేని ఆహారం లభిస్తుందడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇటీవల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అనారోగ్యాలకు ప్రజలు గురవుతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్లు, రెస్టారెంట్లపై నెలకు ఒక్కసారైనా తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో అదే పరిస్థితి
నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో హోటల్లు, రెస్టారెంట్లలో ఆహారపదార్థాలు నాణ్యత లేకుండా ఉంటున్నాయి. ఆహార పదార్థాలు తయారీలోనూ వాడే వస్తువులు సైతం నకిలీ వాటిని ఉపయోగించడంతో ఆహార పదార్థాలు సైతం కల్తీ పదార్థాలుగా అవుతున్నాయి. అధికారులు పర్యవేక్షించి ప్రజలకు నాణ్యమైన ఆహారం అందే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
తనిఖీలు చేపడుతున్నాం
ఫిర్యాదులు వస్తే వెళ్లి పరిశీలిస్తున్నాం. ఆహార పదార్థాల నాణ్యతలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ఎవరైనా నాణ్యత లేకుండా హోటల్, తనిఖీలు నిర్వహించాం. కుళ్ళిన ఆరపదార్థాలు లభిస్తే వారికి ఫైన్ లు కూడా వేసాము. అవసరమైన సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నాం.
--శిరీష, ఇంచార్జ్ ఫుడ్
ఇన్స్‌పెక్టర్, కామారెడ్డి