calender_icon.png 7 August, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన మరమ్మతులు చేయించండి

07-08-2025 12:45:48 AM

  1. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి

వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది  సమన్వయంతో పని చేయాలి 

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి ఆగస్టు 06 ( విజయక్రాంతి ) : వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉండే విధం గా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆద ర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఉద యం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రి చుట్టూ పక్కల పరిసరాలను పరిశీలించారు.  వెంటనే పరిసరాలు శుభ్రం చేయించాలని అదేవిధంగా ఆసుపత్రి చు ట్టూ అవసరమైన చోట సి.సి రోడ్డు, ము రుగు కాలువ మరమ్మతు పనులు చేయించాలని అందుకు అవసరమైన ప్రతిపాద నలు సిద్ధం చేసి పెట్టాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

ఆసుపత్రి వెనక భాగములో ఉన్న ఖాళీ స్థలాన్ని వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలంగా ఉపయోగించుకోవాలని సూచించారు.డాక్టర్లు ప్రొఫె సర్లు హెడ్ క్వార్టర్లో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలి.ఆసుపత్రిలో ఈ.ఎన్.టి వార్డు, ఎ.ఆర్.టి వార్డులను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత విభాగంలో సర్జన్ లు, డాక్టర్లు లేకపోవడాన్ని గమనించారు. డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. మల్లికార్జున్ ను ఆదేశించారు. అనంతరం సూపరింటెండెంట్ ఛాంబర్ లో వైద్య సి బ్బంది తో సమీక్ష నిర్వహించారు.

ఆసుపత్రి లో రోజుకు ఎన్ని సర్జరీ లు చేస్తున్నారు? ప్ర సవాలు ఎన్ని? ఎంత మంది అవుట్ పేషం ట్ వస్తున్నారు ఎక్కువ మంది ఎలాంటి జ బ్బులతో వస్తున్నారు ? ఎన్ని రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు అనే వివరాలు అడగటమే కాకుండా అందుకు సంబంధించిన రికార్డు లు పరిశీలించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. మల్లికార్జున్, జిల్లా వైద్య అధికారి డా శ్రీనివాసులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రంగారావు, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, డా. రామచంద్ర రావు, డా. పరిమళ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.