calender_icon.png 13 December, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

12-12-2025 01:10:47 AM

ఎమ్మెల్యే కోవా లక్ష్మి 

ఆసిఫాబాద్, డిసెంబర్ 11(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మండలం రాజంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బుర్స పోచయ్యతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ కేసి ఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కల్యాణ లక్ష్మి, రైతు బంధు, ఇతర పథకాల ప్రయోజనాలను వివరిస్తూ ప్రజలను అభ్యర్థించారు.

బిఆర్‌ఎస్ బలపరిచన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ప్రజలకు  పూర్తి భరోసా కల్పించారు.ఈ  కార్యక్ర మంలో సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మ ద్,  రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ , కోవ సాయినాథ్, నాయకులు గంధం శ్రీను, నిస్సార్ , అన్సార్ , చిలువేరు వెంకన్న, సాజిద్, ఉమారాణి, లలిత, సుప్రజ, సంగీత తదితరులు  పాల్గొన్నారు.