12-09-2025 11:38:52 PM
కరీంనగర్,(విజయక్రాంతి): సేవా పక్షం కార్యక్రమాలను బిజెపి శ్రేణులు విజయవంతం చేయాలని మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్ రావు అన్నారు. శుక్రవారం నగరం లోని ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే సేవ పక్షం కార్యక్రమాలపై ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ 15 రోజులపాటు ఈనెల 17 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ వర్ధంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వరకు జరగబోయే కార్యక్రమాలన్నీ విజయమంతం చేయాలని పిలుపునిచ్చారు.