calender_icon.png 18 October, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయండి

17-10-2025 12:48:39 AM

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు

రాజన్న సిరిసిల్ల అక్టోబర్ 16 (విజయ క్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే కు వ్యతిరేకంగా తేదీ 18 _10 _2025 శనివారం రోజున రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు అన్నారు, తేదీ 16 10 2025 గురువారం రోజున సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలతో అఖిలపక్ష సమావేశం పర్ష హన్మాండ్లు ఆధ్వర్యంలో నిర్వహించారు,

ఈ సమావేశంలో ఈనెల 18న జరిగే రాష్ట్ర బంద్ మద్దతిస్తున్నట్లు అన్ని ప్రజా సంఘాలు తెలియజేశాయి, ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18న జరిగే రాష్ట్ర బంద్ కురాష్ట్ర వ్యాప్తం గా బిజెపి, బి ఆర్ యస్, టీ జె యస్,సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఎంఆర్పిఎస్ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయాని అందులో భాగంగా రాష్ట్ర బంద్ లో భాగం గా సిరిసిల్ల జిల్లా బంద్ కు ఈ జిల్లాలోని అంబేద్కర్ సంఘాలు, అన్ని బీసీ కుల సంఘాలు,

ఎమ్మార్పీఎస్, అన్ని రాజకీయ పార్టీలు వద్ద తెలిపాయని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు తెలిపారు, శనివారం రోజు జరిగే బంద్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు , కళాశాలలు, మిగతా విద్యాసంస్థలు, ఆర్టీసీ, హోటల్స్ అన్ని వ్యాపార సంస్థలు మూసివేసి బందుకు స హకరించాలని ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రతినిధులు పిలుపునిచ్చారు,

అగ్రవర్ణాలకు మేము వ్యతిరేకం కాదని ఒకరిద్దరూ అగ్రవర్ణ వ్యక్తులు చేయడం వలన బీసీల నోటికాడి ముద్దను ఎత్తుకుపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు, అటువంటి వ్యక్తుల వలన సమాజంలో కులాల మధ్య వి ద్వేషాలు ఏర్పడతాయన్నారు, అటువంటి వ్యక్తులను ఆ కుల సమాజం నియంత్రించాలి అని ప్ర తినిధులు పిలుపునిచ్చారు, హైకోర్టు సుప్రీంకోర్టులో వేసిన కేసులను వెంటనే ఆ వ్యక్తులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు,

రిజర్వేషన్లు సాధించుకునే వరకు జేఏసీగా ఏర్పడి పో రాటం చేయాలని ఉద్యమ బాట పట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు, ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు కత్తెర దేవదాస్ బొజ్జ కనకయ్య, బొప్ప దేవయ్య, చొక్కాల రామ్, బిక్షపతి, మల్లేశం, అంజయ్య లతో పాటు నాయకులు తడుక కమలాకర్, కందుకూరి రామాగౌడ్ ,బండారి బాల్ రెడ్డి ,బోయిన శ్రీనివాస్, తోట్ల మల్లేశం యాదవ్ ,కంచర్ల రాజు, చొక్కి కైలాసం, ఇల్లంతకుంట తిరుపతి, కుసుమ ప్రభాకర్ ,బూర ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.