calender_icon.png 19 October, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో భగ్గుమన్న విబేధాలు

17-10-2025 12:50:18 AM

  1. కరీంనగర్‌లో పార్టీ పరిశీలకుల ఎదుట ఇరు వర్గాల బాహాబాహీ

జిల్లా, నగర అధ్యక్షుల ఎన్నికపై అభిప్రాయసేకరణ, బల ప్రదర్శన చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత

పరిస్థితి విషమించడంతో పోలీసుల రంగ ప్రవేశం

కరీంనగర్, అక్టోబరు 16 (విజయ క్రాం తి): కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో మరోమారు వర్గపోరు బహిర్గతమైంది. ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ మానె ఎదుట ఇరువర్గాలు బల ప్రదర్శనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నంలో అద్దాలు ధ్వంసం కావడంతో తాళాలు వేశారు. వెలిచాల రాజేందర్రావును లోపలికి అనుమతించకపోవడంతో ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు.

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం 32 మంది, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం 22 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ మానె, అర్తం సుగుణలు గత నాలు గు రోజులుగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటిస్తూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గురువారం జిల్లా, నగర అధ్యక్ష పద వుల కోసం ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభించారు.

అయితే బ్లాక్, మం డల, జిల్లా కార్యవర్గంలోనివారు కాకుండా బలప్రదర్శన చోటు చేసుకోవడం ఉద్రిక్తతను దారితీసింది. వెలిచాల రాజేందర్రావు అనుచరులు వందల సంఖ్యలో తరలివచ్చారు. అయితే పార్టీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నవారికి లోనికి అనుమతి లేదని, కేవలం ముఖ్య నేతలతోనే అభిప్రాయాలు సేకరిస్తున్నారని రాజేందర్రావును అనుమతించకపోవ డంతో ఆయన వర్గీయులు కాంగ్రెస్ కార్యాల యం వద్ద ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో పార్టీ కార్యాలయానికి తాళాలు వేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. పరిశీలకులు మానె శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో చర్చిస్తున్న క్రమంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నాడని, ఆయనను ఎలా లోనికి అనుమతించారని వెలిచాల వర్గీయులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తత కు దారితీయడంతో పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు.

రాజేందర్రావు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి అని ఆయన అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన అనుచరులు డిమాండ్ చేయగా, అధ్యక్ష పదవి దరఖాస్తు చేసుకున్నా డు కనుక ముఖ్య నేతల అభిప్రాయాలే తీసుకుంటారని వెలిచాల వర్గీయులు వాదనలకు దిగడంతో పరిశీలకులు మధ్య నుండే వెనుదిరిగారు.గా మారడంతో పరిశీలకులు అర్తం సుగుణ ప్రధాన గేటు వద్దకు వచ్చి వెలిచాల రాజేందర్రావుతో చర్చించి వెనుదిరిగారు.