calender_icon.png 20 November, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై ధాన్యం పోయవద్దు..

19-11-2025 10:39:16 PM

జగదేవపూర్: జగదేవపూర్ మండలం పరిధిలోని రైతులు అవగాహన కలిగి ఉండాలని రోడ్లపై ధాన్యం పోయారాదని ఎస్ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామంలో రైతులకు పోలీస్ సిబ్బంది శశికాంత్ బాలకిషన్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లపై వడ్లు మొక్కజొన్నలు ఇతర ధాన్యాలు పోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వడ్లు కళ్ళల్లో మాత్రమే పోసుకోవాలని లేదా కొనుగోలు కేంద్రాల సమీపంలో ఆరబెట్టుకొని కొనుగోలు చేయాలని సూచించారు. ఎవరైనా పోసినట్లయితే ప్రమాదాలు జరిగితే చట్టరిత్య చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.