08-08-2025 11:43:32 PM
కామారెడ్డి (విజయక్రాంతి): శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలో మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పట్టణాలతో పాటు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల్లో మూలవిరాట్టులకు విశేష అలంకరణ చేశారు. మహిళలు ఆలయాలకు పెద్దఎత్తున తరలివచ్చి సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. ఇళ్లలో వరలక్ష్మీ వ్రతాలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. వరలక్ష్మీ వ్రతం నిర్వహించిన అనంతరం మహిళలకు అయినాలు అందించారు. పసుపు, బొట్టు, పూలు, పళ్ళు అందజేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాలలో..
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం, బాన్సువాడ, పట్టణాల్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు.