calender_icon.png 9 August, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ జీవితాల్లో వెలుగు రేఖలేవీ?

09-08-2025 12:00:00 AM

- ప్రభుత్వాలు మారినా మరని గిరిజన తలరాతలు

- అడవుల్లోనే ఏళ్లుగా దుర్భర జీవితాలు

- ఐటీడీఏ ఉన్న దక్కని ప్రయోజనం

- నేటికీ విద్య, వైద్యం, 

- మౌలిక వసతులు కరువే...

- హక్కుల కోసం ఏళ్లుగా పోరాటం

- నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

మణుగూరు, ఆగస్టు 8 (విజయ క్రాంతి) :అడవులు కొండకోనల మధ్య ఆవాసం.. సంప్రదాయాలు, కట్టుబాట్ల,జీవనం..అడవి తల్లి ఒడిలో నిత్యం ఒదిగి సాగే పయనం.. ఇ లా ప్రత్యేక జీవనశైలి వారి సొంతం. ప్రకృతి ఒడినేనమ్ముకొని దశాబ్దాలుగా పోడు వ్యవసాయమే వారి జీవనం. అయినా వారి బ తుకులు మాత్రం మార డంలేదు. విద్యా, వై ద్యం, రవాణా సదుపాయాలు అంతంత మాత్రమే. పొట్టచేత పట్టుకొని వలస వచ్చిన ఆదివాసీలది.అరణ్య రోదనే. వారికీ పాలకు ల నుండి కనీస సౌకర్యాలు కూడా అందం డం లేదు. పోడు కోసం పోరు తప్పడం లే దు. నేడు ప్రపంచ ఆ దివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రుల జీవన పరిస్థితులపై విజయ క్రాంతి ప్రత్యేక కథనం.

జల్-జంగల్-జమీన్ అనే నినాదం తో సాగిన పోరాటంలో రాంజీ గోండు, కొమ రం భీం లాంటి పోరాట యోధులు అమరులైన తర్వాత కూడా గిరిజనులు వారి మను గడ కోసం నేటికి పోరాడుతూనే ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో ప్రధాన సమస్య అయిన పోడు భూముల పట్టాల కోసం నేటికి ఆటవీ శాఖ అధికారుల చేతుల్లో లాఠీ దెబ్బలు తా కుతూనేఉన్నాయి. నిత్యం ఏదో చోట పోడు కోసం రగడ సాగుతుంది. ఎన్నో తరాలుగా పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న ఈ క్ర మంలో వేల హెక్టార్ల అటవి సంపద పోరుకు జీవం పోసింది.

ఏళ్ల క్రితమే అడవుల్లో పోడు నరికి వేత ఆపేసి,గిరిజనులు ఆ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. రాష్ట్ర ప్ర భుత్వం కూడా వేలా దిమంది గిరిజనులకు రెవెన్యూ శాఖ ద్వారా పట్టాలు పంపిణీ చే సింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూ ములను ఆటవి అధికారులచే స్వాధీనం చే సుకోవడంతో సమస్యవివాదాస్పద మైంది. దీంతో గిరిజ నులంత ఒక్కటై పోడు భూములను కాపాడు కునేందుకు పట్టా లివ్వాలని ఉద్యమబాట పడుతు న్నారు. దీంతో ఆదివాసి జీవితాలలో వెలుగు రేఖలు ప్రస రించడం లేదు.

విద్య, వైద్యం అందని ద్రా క్షే..

ఏజెన్సీలో విద్య, వైద్యం. రవాణాలాంటి కనీస సదుపాయాలు లేని గ్రామాలు అనే కం, మారుమూల గిరిజన గ్రామాల్లో అడవి బిడ్డలు చదువు కునేందుకు కనీస వసతులు కరువయ్యాయి. పాఠశాలలకు వెళ్లాలంటే స రైన రవాణా వ్యవస్థ లేని పరిస్థితులు, ఉపా ధ్యాయులు కూడా అలాంటి గ్రామాలకు వె ళ్లి పాఠాలు చెప్పాలంటే విముకత చూపుతున్నారు. దీంతో విద్యకు దూరమై ఎందరో గిరిజన చిన్నారులు బాల కార్మికు లుగా మి గిలి పోతున్నారు. మరో వైపు గిరిజన గ్రా మాల్లో గర్భిణీలు, బాలింతల పరిస్థితి దారుణంగా ఉంది. వాగులు పొంగినప్పుడు 108, 104, 102, అమ్మ ఒడి వాహనాలు గ్రామాలకు రాలేని దయనీయ స్థితి ఉంటుంది. వ ర్షా కాలంలో గర్భిణులకు పురిటి నొప్పులు వస్తే డోలి కట్టాల్సిందే.మంచాలపై మోసు కొని వాగులు దాటించి తర్వాత ఆ స్ప త్రికి తరలించే పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తోంది.

ఐటీడీఏ ఉన్న దక్కని ప్రయోజనం

గిరిజనుల సంక్షేమ,అభి వృద్ధి కోసం భద్రాచలం కేంద్రంగా సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థ (ఐటీడీఏ) ఏర్పాటు చేసి ఏళ్ళు గడు స్తున్న గిరిజన అభివృద్ధి మాత్రం ఎక్క డ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉం ది. ఆదివాసీల వ్యవహార జీవన విధానంలో కొంత వరకు మార్పు తీసుకువచ్చినా వారి అభివృద్ది కోసం రూపొందిస్తున్న ప్రణాళికలు ఆచరణకు నోచుకోలేదనే విమర్శనలు కూడా ఉన్నాయి. ఉపాధి అవకా శాలు లేక పోవడంతో నేటికి కొందరు ఆదివాసీలు ఆ టవి ఉత్పత్తులపైన ఆధారపడు తున్నారు.

తరాలుగా దట్టమైన అడవి ప్రాంతంలో గూ డు కట్టుకొని అభివృద్ధికి నోచుకోకుండా బ త్రుకుతున్నారు. వర్షా కాలం వచ్చిందంటే గూడాల్లో బ్రతికే వారికి దినదిన గండమైన పరిస్థి తులు. కలుషితమైన నీరు త్రాగుతూ, విషసర్పాలు, దోమ కాటుతో వచ్చే విషజ్వరాలతో అల్లాడు తుంటారు. అత్యవసర పరి స్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాలంటే ఎండ్ల బండ్లే శరణ్యం. ఈ క్రమంలో ప్రాణాలు పో యినా లెక్కలేదు. అయినా కొందరు తాత లు, తండ్రులు నేర్పిన మూలికా వైద్యంతోగిరిజనుల ను బ్రతికించు కుంటారు.

గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లు గిరిజన అభివృద్ది కోసం అనేక ప్రణాళిక లు రచించి, వారి అభివృద్ధికి తోడ్పా టును అందించారు. కానీ గడిచిన కొన్ని సంవత్సరాల లో అధికారులు తరుచూ మారడంతో, పూర్తి స్థాయి అధికారులు లేకపోవడం తో పాలనగాడి తప్పింది.  ఇప్ప టికీ ఐటీడీఏ అధికారులు జిల్లా లోని గిరిజన గ్రామాల్లో పర్యటనలు చేపట్ట కుండా సంక్షేమ కార్యక్రమాల అమ లుకోసం తమ వంతు కృషి చేయడంలో విఫల మౌతున్నారని గిరిజన సంఘల నాయకులు ఆరో పిస్తున్నారు. 

హక్కుల కోసం పోరే..

అప్పటి నైజాం సర్కారు ఆదివాసీ భూ ముల రక్షణకు భూబదలా యింపు చట్టం 1/70 తీసుకువచ్చి నా రక్షణ కల్పించే అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించు కో వడం లేదు. గిరిజన హక్కులఫై ప్రశ్నిస్తే అధికారులు, ప్రజాప్రతి నిధులు మిన్నకుండిపో తున్నారు. గిరిజన చట్టాలు.. గిరిజనేతరుల చుట్టా లవుతున్నాయి. అయినా ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. భూబదలాయింపు నిషేధం ఉన్న షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరుల వలసలు పెరిగి భూముల ఆక్రమణ యథేచ్ఛగా సాగుతోంది. దీంతో గిరిజ నులు మళ్లీ అడవిని నరుక్కుని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారం ఆదివాసీలకు అట వీ, భూమి, నీటిపై పూర్తి హక్కులున్నప్పటికీ, కొత్త చట్టాలు వాటిని ఉల్లంఘిస్తు న్నాయి.

నిధులు బినామీల పాలే...

గిరిజనుల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది కేటాయి స్తున్న నిధులన్ని బినామీల పాలౌతున్నా యి.ఐటీడీఏ నిధులతో నిర్మించిన కుంటలు, చెరువుల్లో పెంచుతున్న చేపలు, రొయ్యలపై హక్కు ఆదివా సీ లకే దక్కాలని చట్టాలు ఉన్నా, వారి గోడు పట్టించు కునేవా రు లేరు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లుగడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హ క్కులను వారి దరికి చేర్చడం లేదు. ఎస్టీ కా ర్పో రేషన్ ద్వారా ప్రతి ఏడాది మంజూర య్యే నిధులను కొందరు పక్క దారి పట్టి స్తు న్నారనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి.

ఆ ర్ధిక స్తోమత లేని ఎస్టీల పేర్లతో ధరఖాస్తులు చేసి గుడ్విల్ కింద సదరు వ్యక్తికి డబ్బు ఎర చూపి వాహనాలుకొనుగోలు చేస్తూ కాంట్రా క్టు వ్యాపారాలు నిర్వహి స్తున్నారు. సంబంధిత అధికారులు, సరైన విచారణ చేయకుం డా నే నిధులు మంజూరు చేస్తుండడంతో గిరిజన వ్యవస్థ కుంటిపడి పోతుంది. పేరుకే గిరిజన సొసైటీలు సోసైటీలు పెత్తనమంతా బినామీ కాంట్రాక్టర్లది. ఇసుక ర్యాంపుల నుం డి మద్యం షాపుల లైసెన్సుల వరకు గిరిజనలను ఆట బొమ్మ లుగా చూపుతూ గుత్తె దా రులంతా కోట్లకు పడగలెత్తుతున్నారు.

అనుమతులు పొందిన గిరిజనులకు తులమో.. ఫలమో ముట్ట జెప్పి బడా వ్యాపారులు మ రింత ఎత్తు కు ఎదుగుతూ గిరిజన అభివృద్ధిని పాతాలానికి తొక్కుతున్నారు. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వా లు అధికా రికంగా అంతర్జాతీ య ఆదివాసీ దినోత్సవం జరుపుతున్న నేడు జరుగుతున్న ఉత్సవాలు పాల కవర్గాల అవసరాల కోసమే తప్ప ఆదివాసీలను కాపా డడానికి కాదని, ఆదివాసుల అవసరాలు ఆ కాంక్షలు నెరవేసిన నాడే ఆదివాసీలకు దినోత్సవ ఫలాలు అందుతాయని, ఆదివాసి సం ఘాల నేతలు అభిప్రాయం పడుతున్నా రు.