09-08-2025 12:30:30 AM
- బాలనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు సన్నద్ధం
- ఎంపీ డీకే అరుణకు కృతజ్ఞతలు తెలిపిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
మహబూబ్ నగర్ ఆగస్టు 8 (విజయ క్రాంతి) : ఏండ్ల తరబడి నవోదయ విద్యాలయం వస్తుందని ఆశించిన పాలమూ రు జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నవోదయ మంజూరు చే స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నవోదయ విద్యాలయం జిల్లాకు మంజూరు చేయ డం చాలా సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా ఎంపీడీకే అరుణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బాలనగర్ మండలంలో పెద్దయి పల్లి లో నవోదయ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు నవోదయ విద్యాలయం రావడంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.